Sai Durga Tej : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి దుర్గా తేజ్..
హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. తాను నటించిన సంబరాల ఏటి గట్టు చిత్ర విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో తిరుమలకు వచ్చినట్లు సాయి దుర్గా తేజ్ తెలిపారు.









