Hyderabad Accident : అర్ధరాత్రి ఘట్‍కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ నగర శివార్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఘట్‌కేసర్ పరిధిలోని చౌదరిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
- kunduru Vinod
- Published On : December 9, 2021 / 11:00 AM IST
Hyderabad Accident
Hyderabad Accident : హైదరాబాద్ నగర శివార్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఘట్‌కేసర్ పరిధిలోని చౌదరిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కకడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
చదవండి : Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
మృతుడు అఖిల్ (19)గా గుర్తించగా.. గాయపడిన వారు విశాల్ (15), సురేష్(20), షఫీ (20) గాయపడినట్లు తెలిపారు. కారును తనిఖీ చేసిన పోలీసులు మద్యం బాటిల్స్ ఉన్నట్లుగా గుర్తించారు. కారును కిరాయికి తీసుకున్నారని, ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సిటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే అఖిల్ మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
చదవండి : Road Accident : ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-తిరుపతి వేదిక్ యూనివర్సిటి ప్రొఫెసర్ మృతి
