Hyderabad : ఓఆర్‌ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ, ఆమె భర్త మృతి
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డుప్రమాదంలో నల్గొండ జిల్లా తానేదార్‌పల్లి ఎంపీటీసీ కవిత, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు.
- kunduru Vinod
- Updated on- September 1, 2021 / 09:56 AM IST
Hyderabad
Hyderabad : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డుప్రమాదంలో నల్గొండ జిల్లా తానేదార్‌పల్లి ఎంపీటీసీ కవిత, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 22న స్వగ్రామంలో వీరి కూతురి వివాహం జరిగింది. వేడుక ముగించుకొని హైదరాబాద్ లోని నివాసానికి బయలుదేరారు.
పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం మలుపు తీసుకుంటున్న టిప్పర్ ను వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
