Enforcement Directorate: వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ రైడ్స్.. రూ.2,000 కోట్ల స్కామ్ గుట్టు రట్టు.. వందలాది ఖాతాలు సీజ్
మల్టీ-క్రోర్ చిట్‌ఫండ్, ఎస్టేట్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) చర్యలు వేగవంతం చేసింది.
ed raids wellfare building estates 2000 crore real estate scam
- వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు
- వేలాది మందికి భారీ మోసం
- లగ్జరీ కార్లు, ఖాతాలు ఫ్రీజ్
Enforcement Directorate: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మల్టీ-క్రోర్ చిట్‌ఫండ్, ఎస్టేట్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చర్యలు వేగవంతం చేసింది. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, దాని డైరెక్టర్ల ఇళ్లతో సహా విశాఖపట్నం, హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.1.01 కోట్ల నగదు, కీలక ఆస్తి పత్రాలు, డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. అలాగే 182 బ్యాంకు ఖాతాలు, 6 లగ్జరీ వాహనాలను ఫ్రీజ్ చేశారు.
పాతవారికి చెల్లిస్తూ రూ.2,000 కోట్ల నిధుల మళ్లింపు:
రియల్ ఎస్టేట్, డిపాజిట్ల పేరుతో వేలాది మంది బాధితుల నుంచి రూ.2,000 కోట్లకు పైగా సేకరించినట్లు ఈడీ దర్యాప్తులో స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలకు విశాఖపట్నంలో భూములు ఇస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు చేశారు. అనంతరం కార్యాలయాలను మూసివేశారు. కొత్త పెట్టుబడిదారుల డబ్బుతో పాతవారికి చెల్లిస్తూ, మిగిలిన భారీ నిధులను డైరెక్టర్లు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మళ్లించారు.
పిఎంఎల్ఎ చట్టం కింద దర్యాప్తు వేగవంతం:
స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా పిఎంఎల్ఎ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది. మోసపోయిన వేలాది మంది బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ దాడులతో అక్రమ నిధుల మళ్లింపుపై మరిన్ని కీలక ఆధారాలు లభించనున్నాయి.
