Vivo Y600K Turbo : వివోనా మజాకా.. కొత్త వివో Y600K టర్బో వస్తోందోచ్.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలు..!
Vivo Y600K Turbo : ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ QTI SM7635 చిప్, 2.80GHz క్లాక్ స్పీడ్ ప్రైమ్ సీపీయూ ఉన్నాయి. వివో Y600K టర్బో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 లేదా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుందని అంచనా.
Vivo Y600K Turbo
- స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్
- ఆండ్రాయిడ్ 16, 6.83-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే
- వివో Y600 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ కావొచ్చు
Vivo Y600K Turbo : వివో లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో మీకోసం అద్భుతమైన ఫోన్ రాబోతుంది. వివో Y600K టర్బోను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ ఉంటుందని అంచనా. ఈ ఏడాది మే నెలలో చైనాలో లాంచ్ అయిన వివో Y600 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు.
వివో Y600K టర్బో, V2553A అనే మోడల్ నంబర్, PD2553 అనే డివైస్ కోడ్‌తో గూగుల్ ప్లే కన్సోల్ సపోర్ట్ చేసే డివైస్ల లిస్టులో చేరింది. ఈ మోడల్ నంబర్ డివైస్ కోడ్ వివో వై600 టర్భోకి కూడా సంబంధించినవే.
రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ వివో వై600 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. అయితే, వివో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇంకా ధృవీకరించలేదు. గూగుల్ ప్లే కన్సోల్‌లో ఈ లిస్టింగ్ ప్రకారం రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే రిజల్యూషన్ 1,260 x 2,800 పిక్సెల్స్, పిక్సెల్ డెన్సిటీ 480dpiగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ QTI SM7635 చిప్, 2.80 GHz క్లాక్ స్పీడ్ ప్రైమ్ సీపీయూతో రన్ అవుతుంది. వివో Y600K టర్బో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 లేదా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్తో వర్క్ అవుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB ర్యామ్ ఉంటుందని అంచనా.
Read Also : Google Pixel 11 Pro XL : రూ.10 వేలు తగ్గుతుందంటే ఎవరైనా కొంటారు.. పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్‌పై భారీ ఆఫర్!
ఆండ్రాయిడ్ 16తో రావచ్చు. వివో Y600 ప్రో ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS6పై రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
వివో Y600 టర్బో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9,020mAh ‘బ్లూ ఓషన్’ బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ కానుంది.
ఈ ఏడాది జూన్‌లో చైనాలో వివో ఎక్స్ ఫోల్డ్ 6 లాంచ్ అయింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. ఇందులో జైస్-బ్రాండెడ్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇటీవల లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ డ్యూయో, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రాతో పోటీ పడనుంది.
