Lakshmibai : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సతీమణి ఆకస్మిక బదిలీ.. హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా నియామకం

Lakshmibai : రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి జి. లక్ష్మీబాయిని హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా ప్రభుత్వం నియామించింది.

Lakshmibai RS Praveen Kumar

Lakshmibai : తెలంగాణ రాష్ట్ర పరిపాలనా విభాగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి జి. లక్ష్మీబాయిని రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమెను ప్రస్తుత పదవి నుంచి తప్పిస్తూ, తెలంగాణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ లిమిటెడ్ (హౌసింగ్ ఫెడరేషన్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల రాష్ట్రంలో కొనసాగుతున్న ఐఏఎస్, ఉన్నతాధికారుల బదిలీల నేపథ్యంలోనే  (Lakshmibai) ఈ మార్పు జరిగినట్లు సచివాలయ అధికారిక వర్గాలు తెలిపాయి. పరిపాలనా అవసరాలతో పాటు పనితీరు సమీక్షలు, విభాగాల పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read Also : AP Govt Employees : ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంపు!

అయితే ఈ బదిలీల వ్యవహారంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా లక్ష్మీబాయి బదిలీ విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సతీమణి కావడంతో ఈ అంశంపై ఎక్కువ దృష్టి పడింది. ఈ బదిలీపై రాజకీయ వర్గాల్లో కూడా అనేక ఊహాగానాలకు కారణమవుతోంది.

మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో లక్ష్మీబాయి వివిధ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల మద్దతు పథకాల అమలులో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఇక తాజా నియామకంతో ఆమె హౌసింగ్ ఫెడరేషన్ పరిపాలనా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ బదిలీతో రాష్ట్రంలో ఉన్నతాధికారుల మార్పుల వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. పరిపాలనా నిర్ణయాల వెనుక ఉన్న కారణాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.