Child Family : రాజు మృతదేహాన్ని మాకు అప్పగించాల్సిందే
సైదరాబాద్ చిన్నారి హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై చిన్నారి కుటుంబం స్పందించింది. తాము రాజు చనిపోయాడంటే నమ్మమని తెలిపారు. పోలీసులు అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు.
- bheemraj
- Published On : September 16, 2021 / 03:47 PM IST
Child (2)
rapist raju’s suicide : సైదరాబాద్ చిన్నారి హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై చిన్నారి కుటుంబం స్పందించింది. తాము రాజు చనిపోయాడంటే నమ్మమని తెలిపారు. పోలీసులు అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. ఒకవేళ రాజు ఆత్మహత్య చేసుకుంది నిజమే అయితే.. అతడి మృతదేహాన్ని చూసే వరకు తాము నమ్మేది లేదని తేల్చి చెప్పారు.. ఆ ఉన్మాది మరణిస్తే సంతోషిస్తాము కానీ.. మృతదేహాన్ని చూసే వరకు మాత్రం తమకు నమ్మకం కుదరదన్నారు.
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యపై సైదాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా మృతుడి మృతదేహాన్ని తమకు చూపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అది అసలు రాజు మృతదేహమేనా? అంటూ టెన్ టీవీతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయింది రాజేనని తమకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదని అంటున్నారు స్థానికులు.
HYD : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య
రైల్వే ట్రాక్‌పై ముఖం ఛిద్రమై ఉన్న మృతదేహాన్ని చూపించి, అదే రాజు మృతదేహం అంటుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. పోలీసులు చూపెడుతున్న మృతదేహాన్ని తమకు అప్పగించాల్సిందేనని ఆందోళనకు దిగారు. రాజు మృతదేహాన్ని కోర్టు సమక్షంలో అధికారికంగా నిర్ధారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆ మృగాడు ఏ ఇంట్లో అత్యాచారం చేశాడో అదే ఇంట్లో అతడి మృతదేహాన్ని కోసి, పాతిపెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీకి రాజుని ప్రాణాలతో పట్టుకొచ్చి, ఇక్కడే ఉరి తీస్తే బాగుండేదని అన్నారు సైదాబాద్ పరిసర ప్రాంతాల్లోని స్థానికులు.
