HYD : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

HYD : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

Raju Suicide

Saidabad Rape: చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 09వ తేదీన సైదబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇతడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడిన కఠినంగా శిక్షించాలని, ఎన్ కౌంటర్, ఉరి తీయాలనే బహిరంగంగా డిమాండ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో…నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ – వరంగల్ ట్రాక్ పై రాజు మృతదేహం లభ్యమైంది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఇతడి మృతదేహం గుర్తించారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు అని నిర్ధారించారు.

Read More : మానవ మృగం కోసం వేట.. 32 జిల్లాల ఎస్పీలు రంగంలోకి

పట్టిస్తే 10 లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన పోలీసులు.. రాజు ఎలా ఉంటాడో ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం జుట్టుతో ఉన్న రాజు గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడో కూడా ఫోటోలు విడుదల చేశారు. హైదరాబాద్ వాసులే కాకుండా.. ఇతర జిల్లాల ప్రజలు కూడా రాజును గుర్తుపట్టేలా బస్సులపై పోస్టర్లు అంటిస్తున్నారు. ఫోటోలు పట్టుకుని ఇతన్ని ఎక్కడైనా చూశారా అంటూ అరా తీస్తున్నారు. ఎవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే.. ఆచూకీ చెప్పాలంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Read More : JusticeForGirl : రాజుగాడెక్కడ..? 2,700 సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ ఆలీ, సత్యవతి రాథోడ్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపున రూ. 20 లక్షల చెక్కును వారికి అందచేశారు. నిందితుడిని పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అతడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అయితే…ప్రభుత్వం ఇచ్చిన చెక్ వద్దని, నిందితుడు రాజును ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలంటూ..వారు రోదించారు. ఈ క్రమంలో..నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.