Cars Gifted To Employees : సంక్రాంతి కానుకగా ఎక్కడైనా పని చేసే ఉద్యోగులకు యాజమాన్యాలు గిఫ్ట్ లు ఇవ్వడం కామన్. అయితే, వారికి జీతం బోనస్ గా ఇవ్వడమో లేదా చిన్న చిన్న కానుకలు ఇవ్వడమో తెలిసిందే. కానీ, కొన్ని సంస్థలు మాత్రం ఊహించని కానుకలు ఇచ్చి తమ ఉద్యోగులను సర్ ప్రైజ్ చేస్తాయి. హైదరాబాద్ లోని సంపంగి గ్రూప్.. తమ ఉద్యోగులకు అలాంటి అదిరిపోయే సంక్రాంతి కానుకే ఇచ్చింది. ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది.
సంపంగి గ్రూప్ ఆర్గనైజేషన్ తమ సంస్థలోని ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ లు అందించింది. కంపెనీ మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంక్రాంతి కానుకలను ప్రజెంట్ చేసింది. తమ సంస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది ఉద్యోగులకు ప్రీమియం కార్లను అందజేసింది. చైర్మన్ రమేశ్ సంపంగి, సీఈవో సురేశ్ సంపంగిలు జూబ్లీహిల్స్ లోని తమ ఆఫీస్ వద్ద వీటిని అందజేశారు. తమ సంస్థలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఇవ్వడమే కంపెనీ లక్ష్యం అన్నారు చైర్మన్ రమేశ్ సంపంగి.