Kukatpally Bike Accident : షాకింగ్ వీడియో.. ప్రాణం తీసిన అతివేగం, హైదరాబాద్ కూకట్‌పల్లిలో బైకర్ స్పాట్ డెడ్
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద నగర్ లో బైక్ పై వేగంగా వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడు స్పాట్ లోనే చనిపోయాడు.
- Naveen
- Published On : December 15, 2022 / 07:52 PM IST
Kukatpally Bike Accident : అతివేగం అత్యంత ప్రమాదకరం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. మితిమీరిన వేగం ప్రాణానికే ప్రమాదం.. ఈ విషయం అందరికీ తెలుసు. అతివేగం కారణంగా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో కళ్లారా చూస్తున్నాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద నగర్ లో బైక్ పై వేగంగా వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడు స్పాట్ లోనే చనిపోయాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Also Read..Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన
వివేకానంద నగర్ ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన బైకర్ అదుపు తప్పడంతో బైక్ పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్ ను కళ్లారా చూసిన వారు షాక్ కి గురయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాక్సిడెంట్ జరిగిన తీరు షాక్ కి గురి చేస్తోంది.
వాహనదారులు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, అతివేగం ప్రాణాంతకం అని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతూనే ఉన్నారు. అతివేగంగా కారణంగా ఎంతటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. అయినా, ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఏ తప్పు చేయని అమాయకులు బలైపోతున్నారు.
