Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన

బైకుపై వెళ్తున్న ఒక వ్యక్తి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. ట్రక్కు పక్క నుంచి, బైకుపై వెళ్తుండగా ఆ ట్రక్కుకు కట్టిన తాడు బైకర్ మెడకు చుట్టుకుంది. దీంతో అతడు బైకు పై నుంచి కింద పడిపోయాడు.

Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన

Updated On : December 15, 2022 / 3:43 PM IST

Tamil Nadu: తమిళనాడులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక బైకర్ ట్రక్కు పక్క నుంచి వెళ్తుండగా, ఆ ట్రక్కుకు కట్టిన తాడు ప్రమాదవశాత్తు అతడి మెడకు చుట్టుకుంది. దీంతో బైకర్ నేల మీద పడిపోయాడు. ఈ ఘటన తమిళనాడు, తూత్తుకుడిలోని ఎరాల్ ప్రాంతం పరిధిలో తాజాగా జరిగింది.

India-China Clash: లోక్‭సభలో వరుసగా మూడో రోజు వాయిదా నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

శ్రీవైకుంఠం పట్టణానికి చెందిన ముత్తు అనే వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కు పక్క నుంచి బైక్ రైడ్ చేస్తున్నాడు. అయితే, ట్రక్కు పైన కట్టిన తాడు ప్రమాదవశాత్తు కింద పడబోతూ, పక్కనే బైకు మీద నుంచి వెళ్తున్న ముత్తు మెడకు చుట్టుకుంది. దీంతో బైకుపై వెళ్తున్న ముత్తు రోడ్డుపై పడిపోయాడు. బైకు దూరంగా పడిపోయింది. ఈ ఘటనలో అతడికి గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన స్థానికులు అతడ్ని రక్షించారు. పక్కకు తీసి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలపాలైన అతడు ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు.

ఈ ట్రక్కు ఫెర్టిలైజర్స్ తీసుకెళ్తోంది. వాటికి ట్రక్కు పైన తాడు సరిగ్గా కట్టకపోవడంతో అది మార్గమధ్యలో కింద పడబోయింది. అదే తాడు ముత్తు మెడకు చుట్టుకుంది. ఈ ఘటన రోడ్డు పక్కన అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.