Zaheerabad Tragedy: రూ.500 కోసం కన్నతండ్రినే హత్య.. గొంతు కోసి దారుణంగా.. జహీరాబాద్‌లో ఘోరం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad Tragedy)మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో రూ.500 నోటు కోసం ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు.

Son kills father for 500 rupees dispute in zaheerabad sangareddy district

  • రూ.500 కోసం తండ్రి హత్య
  • గొంతు కోసి చంపిన కొడుకు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

Zaheerabad Tragedy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో అత్యంత ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. సమాజంలో మనుషుల మధ్య అనుబంధాను కాలరాస్తూ కేవలం రూ.500 నోటు కోసం ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన 70 ఏళ్ల శంకర్ అనే వృద్ధుడు తన కుమారుడు తుకారం (35)తో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తుకారం తన ప్యాంట్ జేబులో ఉన్న రూ.500 పోగొట్టుకోగా, ఆ డబ్బును తండ్రే తీసుకున్నాడని అనుమానించి ఆయనతో తీవ్రంగా గొడవపడ్డాడు. తండ్రి ఎంతగా బ్రతిమిలాడినా వినకుండా, క్షణికావేశంలో ఇంట్లోని కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోసి హతమార్చాడు.

Bandi Sanjay: లక్నోలో యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చ.. యోగి ఆసక్తికర కామెంట్స్

అల్లిపూర్‌లో తీవ్ర కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు:

తన డబ్బులు తీసుకోలేదని ఆ వృద్ధ తండ్రి ఎంత మొత్తుకున్నా కనీస జాలి చూపని కొడుకు, రక్తపు మడుగులో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచేలా చేశాడు. కేవలం ఐదు వందల రూపాయల కోసం సొంత తండ్రిని అంతమొందించిన తీరు స్థానిక అల్లిపూర్ గ్రామాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు, భయాకర వాతావరణం నెలకొన్నాయి.

కేసు నమోదు చేసిన జహీరాబాద్ పోలీసులు:

సమాచారం అందుకున్న వెంటనే జహీరాబాద్(Zaheerabad Tragedy) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తుకారంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపిన ఆ కసాయి కొడుకుకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.