Bandi Sanjay: లక్నోలో యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చ.. యోగి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Union minister bandi sanjay meets Up chief minister yogi adityanath
- యోగి ఆదిత్యనాథ్‌తో సంజయ్ భేటీ
- తెలంగాణ బీజేపీపై ముమ్మర చర్చ
- డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి
Bandi Sanjay: ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)శుక్రవారం సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సశస్త్ర సీమా బల్ (SSB) అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం లక్నోలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన ఆయన, యోగితో అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో బీజేపీ పరిస్థితి, ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాల గురించి విస్తృతంగా చర్చించారు.
Sugar Prices: ఇథనాల్ ఉత్పత్తిలో చక్కెర.. ధరల పెరుగుదలకు కారణం అదేనా?.. కేంద్రం కీలక కామెంట్స్
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే నిజమైన అభివృద్ధి:
ఈ సమావేశంలో సీఎం యోగి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లవేళలా సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. యూపీ తరహాలోనే తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర నిధుల వినియోగం ద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ముందడుగు వేస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో అధికారంపై ధీమా:
రాష్ట్రంలో బీజీపీకి అత్యంత సానుకూల వాతావరణం ఉందని, నాయకులంతా ఐక్యంగా ముందుకు సాగితే అధికారం సాధించడం ఖాయమని యోగి వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో మూడోసారి గెలిచి మళ్లీ కాషాయ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
