Gold Silver Price Today : బంగారం ధరల్లో ఒక్కరోజులోనే భారీ మార్పులు.. నేటి రేట్లు ఇవే.. తులం ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం తగ్గిన గోల్డ్ రేటులో ఇవాళ భారీ మార్పు చోటు చేసుకుంది.

బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కోసారి గోల్డ్ రేటు తగ్గుతుండగా.. ఒక్కోసారి భారీ పెరుగుతోంది. తాజాగా.. బంగారం ధర మళ్లీ పెరిగింది.

గత వారం రోజులుగా ఒక్కరోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేటు.. శుక్రవారం భారీగా తగ్గగా.. ఇవాళ స్వల్పంగా పెరిగింది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 160 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,670 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,730 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,850 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,580కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
