×
Ad

Special Trains : శబరిమలకు ప్రత్యేక రైళ్లు

పండుగలు, అయ్యప్ప భక్తుల దృష్ట్యా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

  • Published On : December 9, 2021 / 09:26 PM IST

Train (3)

special trains to Sabarimala : పండుగలు, అయ్యప్ప భక్తుల దృష్ట్యా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 17న సికింద్రాబాద్ నుంచి కొల్లాం స్టేషన్ కు 07109 నెంబర్ రైలు బయల్దేరనుంది.

డిసెంబర్ 19న కొల్లాం నుంచి సికింద్రాబాద్ కు 07110 నెంబర్ రైలు బయల్దేరనుంది. డిసెంబర్ 10న ఉదయం 8 గంటలకు 07109 నెంబర్ రైలుకు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Tiger : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి కలకలం

ప్రత్యేక రైళ్లు.. చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పడి, జోలార్ పెట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్ చెరి, తిరువళ్ల, చెంగనూరు, మావలికర, కయాంకులం రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి.