×
Ad

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లో ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

special trains

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాకినాడ – నర్సాపూర్ మధ్య వన్ వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు 8, 11 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరికొన్ని రూట్లలో నడిచే రైళ్లను కూడా పొడిగించింది.

Also Read : China Weapon : చైనా చేతిలో పవర్‌ఫుల్ వెపన్.. ఒక్కదెబ్బకు శాటిలైట్లను మసి చేస్తుంది.. బాబోయ్.. యమా డేంజర్..

కాచిగూడ – నర్సాపూర్ (టైన్ నెం.07510)కు ఆదివారం నుంచి ఈనెల 11వరకు ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ప్రతి రోజూ సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40గంటలకు తిరిగి చేరుకుంటుందని చెప్పారు. ఈ రైలుకు మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్ లో స్టాఫ్ ఉంటుందని పేర్కొన్నారు.

కాకినాడ టౌన్ – మైసూర్ మధ్య (రైల్ నెం. 07033) నడుస్తున్న ప్రత్యేక రైలును మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతీ సోమ, శుక్రవారం ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. మరోవైపు.. మైసూర్ – కాకినాడ టౌన్ మధ్య రైలును కూడా మార్చి 3వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ప్రతి మంగళవారం, శనివారం తేదీల్లో ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.