China Weapon : చైనా చేతిలో పవర్ఫుల్ వెపన్.. ఒక్కదెబ్బకు శాటిలైట్లను మసి చేస్తుంది.. బాబోయ్.. యమా డేంజర్..
China Weapon : అంతరిక్ష రంగంలో ఆధిపత్యంకోసం చైనా మరో సంచలన ఆయుధాన్ని సిద్ధం చేసింది. అంతరిక్షంలోని శాటిలైట్లను టార్గెట్‌గా అత్యంత శక్తిమంతమైన హైపవర్ మైక్రోవేవ్ అనే ఆయుధాన్ని అభివృద్ధి చేసింది.
China High Power Microwave Weapon
- శాటిలైట్స్ టార్గెట్‌గా చైనా కొత్త వెపన్
- హై పవర్ మైక్రోవేవ్ వెపన్ తయారు చేసిన డ్రాగన్
- స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేసే సామర్థ్యం
China Weapon : అంతరిక్ష రంగంలో ఆధిపత్యంకోసం చైనా మరో సంచలన ఆయుధాన్ని సిద్ధం చేసింది. అంతరిక్షంలోని శాటిలైట్లను టార్గెట్‌గా అత్యంత శక్తిమంతమైన హైపవర్ మైక్రోవేవ్ అనే ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. దీనిద్వారా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట్‌వర్క్‌కు అంతరాయం కలిగించొచ్చు.. అంతేకాదు.. దాన్ని పూర్తిగా ధ్వసంకూడా చేయొచ్చు.
Hyderabad: లోన్ యాప్ మోసగాళ్ల బారిన పడ్డ మరో వ్యక్తి.. సైబర్ నేరగాళ్లు ఎలా వేధించారంటే?
షాంగ్జీ ప్రావిన్స్‌లోని నార్త్‌వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ (ఎన్ఐఎన్టీ) శాస్త్రవేత్తలు టీజీపీ 1000 సీఎస్ పేరుతో హైపవర్ మైక్రోవేవ్ వ్యవస్థను తయారు చేశారు. ఒక గిగావాట్ కంటే ఎక్కువ శక్తి కలిగిన గ్రౌండ్బేస్డ్ మైక్రోవేవ్ ఆయుధం భూమికి అతి తక్కువ ఎత్తులో తిరిగే స్టార్ లింక్ వంటి ఉపగ్రహాలను దెబ్బతీసేంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
హైపవర్ మైక్రోవేవ్ ప్రధాన లక్ష్యం శాలిటైట్లు, డ్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడమేనని సైంటిస్టులు పేర్కొన్నారు. అమెరికా ఉపగ్రహాలు తమ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని చైనా భావిస్తోంది. వాటిని అడ్డుకోవడానికే హైపవర్ మైక్రోవేవ్ వెపన్ తయారు చేసినట్లు చెబుతున్నారు.
చైనా తయారు చేసిన హైపవర్ మైక్రోవేవ్ అనే ఆయుధం ఒక నిమిషంపాటు 20 గిగావాట్ల విద్యుత్ శక్తిని విడుదల చేయగలదు. ఈ పరికరం కేవలం నాలుగు మీటర్ల పొడవు ఉంటుంది. సుమారు ఐదు టన్నుల బరువు ఉంటుంది.
హైపవర్ మైక్రోవేవ్ వేపన్ను ట్రక్కులు, నౌకలు లేదా విమానాలపైకూడా అమర్చవచ్చు. సాధారణంగా ఇలాంటి మైక్రోవేవ్ ఆయుధాలు కొన్ని సెకన్లకే వేడెక్కుతాయి. కానీ, చైనా తయారు చేసిన ఈ కొత్త సిస్టమ్ 3వేల హై-ఎనర్జీ పల్స్‌లను వరుసగా విడుదల చేయగలదు. ఇప్పటికే అనేక సార్లు దీనిని విజయవంతంగా పరీక్షించారు.
