Special trains
Special Trains : హోలీ పండుగ వేళ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి, తిరుపతి నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక రైళ్లు ఇలా..
♦ చర్లపల్లి నుంచి నిజాముద్దీన్ (న్యూఢిల్లీ) కు ఈ నెల 23, 28, మార్చి 2 తేదీల్లో, నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి ఈ నెల 25, మార్చి 2, 4 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
♦ చర్లపల్లి నుంచి మదార్‌కు ఈనెల 28న, మదార్ నుంచి చర్లపల్లికి మార్చి 3న.
♦ తిరుపతి నుంచి సికింద్రాబాద్ మీదుగా రక్సాల్‌కు ఈనెల 21, 28, మార్చి 7 తేదీల్లో, రక్సాల్ నుంచి తిరుపతికి ఈ నెల 24, మార్చి 3, 10 తేదీల్లో ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి.
♦ సికింద్రాబాద్ నుంచి నహరిగూన్‌కు ఈనెల 27న.. అదేవిధంగా తిరుగుప్రయాణంలో నహరిగూన్ నుంచి సికింద్రాబాద్‌కు మార్చి 2న ప్రత్యేక రైళ్లు బయల్దేరతాయని రైల్వే అధికారులు తెలిపారు.
తీర్థయాత్రల కోసం ప్రత్యేక రైళ్లు..
♦ రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఐఆర్ సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ తెలిపారు.
♦ హైదరాబాద్ నుంచి మార్చి 21 నుంచి మే 21వ తేదీ వరకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా తీర్థయాత్రల ప్రయాణాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.
♦ ప్కాకేజీల ద్వారా తీర్థయాత్రలు వెళ్లే యాత్రికుల కోసం బస్సు, హోటల్, అల్పాహారం, భోజనం, తాగునీరు, ఎసార్ట్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. సందర్శించే దేవాలయాల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని తెలిపారు.
♦ ప్రతీ రైలులో 705 మంది ప్రయాణికులు, ప్రతి 70 మందికి ఇద్దరు కో-ఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని వసతి, సౌకర్యాలు కల్పిస్తారని వివరించారు.
♦ మరింత సమాచారం కోసం వెబ్ సైట్ www.irctctourism.com ను, అదేవిధంగా టికెట్ల బుకింగ్ కోసం 970 1360701, 9281030727, 9281030759 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.