Special Trains: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. ఆ ప్రాంతాల మీదుగా వీక్లీ ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..
South Central Railway : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో పలు వీక్లీ రైళ్లను, ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
- Harish Thanniru
- Updated on- April 18, 2026 / 12:48 PM IST
South Central Railway Weekly and Special Trains via Vijayawada Tirupati
- దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
- వేసవి రద్దీ దృష్ట్యా వీక్లీ, స్పెషల్ రైళ్లు
- ఏపీ, తెలంగాణలోని ప్రాంతాల మీదుగా ప్రయాణం
Special Trains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చర్లపల్లి – నర్సాపూర్ మధ్య ఈ రైలు సర్వీసును అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read : డేంజర్ బెల్స్.. బయటకు రాకండి.. రాబోయే రెండు నెలలు జాగ్రత్త..! సంచలన నివేదిక .. బాబోయ్ మంటలే..
వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు వీక్లీ రైళ్లను రెగ్యులర్ చేసింది. మరికొన్నింటిని పొడిగించింది. అయితే, చర్లపల్లి – నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో 2ఏ, 3ఏ, స్లీపర్ బోగీలు, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. వారాంతపు రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే వారికి ఈ రైలు అనువుగా ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.
చర్లపల్లి – నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును మే రెండో తేదీన ప్రారంభించనున్నారు. ప్రతి శనివారం రాత్రి 7.50 గంటలకు ఈ రైలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. రాత్రి 9.35 గంటలకు నల్గొండకు చేరుకుంటుంది. రాత్రి 1.15 నిమిషాలకు గుంటూరు, రాత్రి 2.35గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటుంది. ఇక తెల్లవారుజామున 3.45 గంటలకు గుడివాడ, 4.35గంటలకు కైకలూరు చేరుకుంటుంది. తెల్లవారుజామున 4.55 గంటలకు ఆకివీడు, 5.30గంటలకు భీమవరం టౌన్ చేరుకుంటుంది. 5.45 నిమిషాలకు వీరవాసరం, ఆదివారం ఉదయం 6గంటలకు పాలకొల్లు, 7గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.
నర్సాపురం – చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు (17062) ఏప్రిల్ 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అప్పటి నుంచి ప్రతి ఆదివారం రోజూ రాత్రి 8గంటలకు నర్సాపూర్ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించి రాత్రి 10.58గంటలకు విజయవాడ జక్షన్ చేరుతుంది. అనంతరం గుంటూరు, నల్గొండ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించి సోమవారం ఉదయం 7.50గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు ఎక్స్ ప్రెస్ చేరుకుంటుంది.
🚆 New Weekly Express Introduced
South Central Railway introduces Charlapalli – Narasapur – Charlapalli Weekly Express
🗓️ Train Nos.: 17061/17062
• 17061 (Sat) from Charlapalli – Starts 02.05.2026
• 17062 (Sun) from Narasapur – Starts 26.04.2026
🚉 Connects key stations like… pic.twitter.com/lKiTyMV3VN— South Central Railway (@SCRailwayIndia) April 17, 2026
మరోవైపు.. వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. బెంగళూరు నుంచి మహారాష్ట్రలోని బలార్షా వరకు ప్రత్యేక రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు (నం. 06551) ఈ నెల 24వ తేదీన బెంగళూరులో ఉదయం 8:50 గంటలకు బయలుదేరుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు (రెండో రోజు) ఉదయం 6:00 గంటలకు బలార్షా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (నం. 06552) బలార్షాలో ఉదయం 5.15గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 3గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడ, వరంగల్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతూ వెళ్తుండటంతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం మారింది.
చర్లపల్లి నుంచి పశ్చిమ బెంగాల్ లోని సంత్రాగాఛి మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ మరో ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ రైలు (07677)ఈనెల 21వ తేదీన చర్లపల్లి స్టేషన్ నుంచి ఉదయం 10.30 గంటలకు బయలు దేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సంత్రాగాఛి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 07678) ఈ నెల 22వ తేదీన సంత్రాగాఛిలో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. విజయవాడ, విశాఖపట్టణం మీదుగా వెళ్లే ఈ రైలు కోల్ కతా వైపు వెళ్లే ప్రయాణికులకు, ఉత్తరాంధ్ర వాసులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుంది.
