Special Trains : రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..

Special Trains : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీని తట్టుకునేందుకు జోన్ పరిధిలో, జోన్ నుంచి ఇతర జోన్లకు ప్రత్యేక రైళ్లు నడపనుంది.

Indian Railway

  • రైల్వే ప్రయాణికులకు శుభవార్త
  • దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
  • వేసవి రద్దీ దృష్ట్యా స్పెషల్ ట్రైన్స్

Special Trains : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీని తట్టుకునేందుకు జోన్ పరిధిలో, జోన్ నుంచి ఇతర జోన్లకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు వివిధ రూట్లలో 46 ట్రిప్పుల అదనపు రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

Also Read : TS inter results 2026 : తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు..! ఇలా చెక్ చేసుకోండి

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, వంటి ప్రధాన స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు, అనకాపల్లి, కాకినాడ, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్లు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 10 నుంచి 17 వరకు వివిధ తేదీల్లో అందుబాటులో ఉంటాయి.

ప్రత్యేక రైళ్లు చర్లపల్లి – తిరుచానూరు మార్గంలో ఏప్రిల్ 12, 15 తేదీల్లో, తిరుపతి – చర్లపల్లి మధ్య ఏప్రిల్ 14, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి వెళ్లే ప్రయాణికుల కోసం ఏప్రిల్ 12, 16 తేదీల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లికి ఏప్రిల్ 10, 13, 15 తేదీల్లో మూడు ట్రిప్పుల పాటు ట్రైన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ట్రైన్ల వల్ల ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయాణం సులభతరం కానుంది.

తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు ట్రిప్‌లను‌కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తిరుపతి, కాకినాడ, నాందేడ్, ధర్మవరం, మైసూరు వంటి కీలక మార్గాల్లో ఈ సేవలు అందించనున్నారు. రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, ఈ స్పెషల్ ట్రైన్స్ ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఒత్తిడి లేని ప్రయాణాన్ని అందించడం లక్ష్యమని పేర్కొన్నారు.

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి – రక్సౌల్ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ప్రతి ఆదివారం చర్లపల్లి – రక్సౌల్ ప్రత్యేక రైలు ఈనెల 12 నుంచి మే 31 వరకు. అదేవిధంగా ప్రతి బుధవారం రక్సౌల్ – చర్లపల్లి ప్రత్యేక రైలు ఈనెల 15 నుండి జూన్ 3 వరకు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు జనగావ్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, సిర్‌పూర్, కాగజ్‌నగర్, బాల్హార్షా, చందాఫోర్ట్, వాడ్సా, గోండియా, రాజ్ -నందగావ్, దుర్గ్, రాయిపూర్, బిలాస్ పూర్, రాఘఘర్, ఝార్సుగూడ, రూర్కేలా, రాంచి, మురి, బొకారో స్టీల్ సిటీ, ధన్బాద్, చిత్తరంజన్, మాధుపూర్, జసిదిహ్, ఝాఝా, బరౌనీ, సమస్తిపూర్, దర్భంగా, కామతౌల్, జనక్ పూర్, సితామార్షి, బైరంగ్‌నియా స్టేషన్ లలో ఆగుతాయి.