Inter Student : ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

మార్కులు తక్కువగా రావడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది

Inter Student : గురువారం తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ మొదటి ఏడాదిలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 51 శాతం మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు కొందరు మనోవేదనకు గురవుతున్నారు. మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

చదవండి : Intermediate Exams Results : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గాంధీ నగర్ కాలానికి చెందిన జాహ్నవి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. గురువారం విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో మార్కులు తక్కువగా రావడంతో మనస్తాపం చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యతో కాలనిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

చదవండి : TS Inter : తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపులు..నేడు విడుదలయ్యేనా ?

ట్రెండింగ్ వార్తలు