TS Inter : తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపులు..నేడు విడుదలయ్యేనా ?
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదల కాగానే.. విద్యార్థులు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి....

Results
Telangana Inter 2021 : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పరీక్షలు రాసి 40 రోజులు దాటుతున్నా ఫలితాలు ఇంకా రాకపోవడంతో నిరుత్సాహంలో ఉన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రతిరోజు ఫలితాలు ఈ రోజు వస్తాయోమోనని ఎదురు చూస్తున్నారు. అయితే…2021, డిసెంబర్ 16వ తేదీ గురువారం విడుదల కానున్నట్లు సమాచారం.
Read More : Lakhimpur Kheri Violence : కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు ఢిల్లీ పెద్దల పిలుపు.. మంత్రిపదవి ఊడినట్లేనా?
ఫలితాలు వెల్లడిస్తామంటూ.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తెలంగాణ సర్కార్ నిర్వహించింది. వాటికి సంబంధించిన ఫలితాలు.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదల కాగానే.. విద్యార్థులు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఇచ్చి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మార్కుల లిస్టు ఉంటుంది.
Read More : Bank Strike: దేశవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఫలితాల విడుదలకు సంబంధించి.. ఇప్పటికే ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు సమాచారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరైన సుమారు 4 లక్షలకు పైగా విద్యార్థుల పరీక్షా ఫలితాలు తేలనున్నాయి.