HCU Student : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
HCU Student : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Updated on- May 19, 2026 / 10:09 PM IST
Hyderabad Central University
HCU Student : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఎంఏ ఎకానిమిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన మయాంక్ కుందు.. యూనివర్శిటీలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read : Software jobs : ఐటీ ఉద్యోగులకు భారీషాక్.. భారత ఐటీ రంగానికి ముప్పు తప్పదా? సాఫ్ట్‌వేర్ ఉచితం కాబోతోంది..
యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారం మేరకు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మయాంక్ గతంలో యూనివర్శిటీలో ల్యాప్ టాప్‌లు దొంగతనంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, నేడు మరొక ల్యాప్‌టాప్ పోవడంతో తనను దొంగ అని ముద్ర వేస్తున్నారని మనస్థాపానికిలోనైన మయాంక్ కుందు యూనివర్శిటీ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
