Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ.. మంత్రి పొంగులేటిని భర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్..
Telangana Assembly :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
- Harishth Thanniru
- Published On : March 29, 2026 / 11:57 AM IST
Telangana Assembly
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధ తీవ్ర స్థాయిలో కొనసాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భర్తరఫ్ చేయాంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. రాఘవకన్ స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ నిలదీసింది.
Also Read : Telangana Govt : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్‌న్యూస్.. అవన్నీ ఇక మీ ఇంటికే..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి కుటుంబం స్కాం బయట పెట్టడంతో ప్రభుత్వం బిత్తర పోయింది. ముఖ్యమంత్రి వాటా ఉన్నందుకు చర్య తీసుకోవడం లేదా..? అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులదని ముఖ్యమంత్రి అంటున్నారు. 2020- 22 వరకు పొంగులేటి చైర్మన్. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో ముఖ్యమంత్రి పొంగులేటి కంపెనీకి ఇచ్చారని కేటీఆర్ అన్నారు.
రెండున్నర ఏళ్లుగా ప్రజలకు పనికివచ్చే ఒక పని కూడా ప్రభుత్వం చేయట్లేదు. మంత్రి పొంగులేటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? మంత్రి కుటుంబన్నీ ఎందుకు కాపాడుతున్నారు..? మైనింగ్ మంత్రి సిగ్గు పడాలి. ఎన్ని కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట్‌లో ముఖ్యమంత్రి బంధువులది. 1800 కోట్లు ఆదాయం రావాలి.. వస్తున్నది 900 కోట్లు. మిగతావి ఎవరి జేబులోకి పోతున్నవి..? వేల కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేసుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రభుత్వం ఆడిస్తున్నట్టు బీజేపీ ఆడుతుందని కేటీఆర్ ఆరోపించాురు. ప్రవేట్ భూములలో గుండాలను వేసుకొని కబ్జా చేస్తున్న వారిని కూడా మేము వదిలిపెట్టం. మెట్రో పై స్టేట్మెంట్ చాలా తప్పుగా ఉంది. ముఖ్యమంత్రి సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. 280 ఎకరాల ఎల్ అండ్ టికి లీజు కి ఇచ్చాం.. ఆ భూమినీ కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రాయదుర్గం వద్ద మెట్రోకి కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతుంది..? ఎల్ అండ్ టి సీఎఫ్‌ఓనీ జైలులో వేస్తామని బెదిరించారు. ఇది పెద్ద కుంభకోణం. ప్రభుత్వం వినకపోతే గవర్నర్ ను కూడా కలుస్తాం. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ అన్నారు.
మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి అక్కడ బైఠాయించారు. మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీసీఐడీ విచారణ చేయిస్తామని చెప్పారు.. మళ్లీ హౌస్ కమిటీ కోసం డిమాండ్ చేయడం ఏం పద్దతి.. బీఆర్ఎస్ నేతలకు ఇదేమైనా న్యాయంగా అనిపిస్తుందా అంటూ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.
