Telangana Cabinet expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్.. ప్రస్తుత మంత్రుల్లో ఒకరు ఔట్..? శాఖల్లో భారీ మార్పులుండే ఛాన్స్..
Telangana Cabinet expansion : మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే మంత్రివర్గంలో చోటుకోసం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ లు సూచించిన వారికి మంత్రివర్గంలో చోటు దక్కబోతుందని తెలుస్తోంది.
- Harishth Thanniru
- Published On : March 19, 2026 / 10:09 AM IST
Telangana Cabinet expansion
- తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు
- గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పార్టీ హైకమాండ్
- ప్రస్తుత మంత్రుల్లో ఒకరు ఔట్?
- మంత్రుల శాఖల్లో భారీ మార్పులుండే చాన్స్
Telangana Cabinet expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత మంత్రుల్లో ఒకరిని పక్కన పెట్టి.. అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని.. లంబాడా సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని.. ఆ మేరకు పార్టీ హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది.
Also Read : Bhavya scheme : ‘భవ్య’ పథకంకు శ్రీకారం.. ఈ పథకం వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా? నిరుద్యోగులకూ గుడ్‌న్యూస్..
సీఎం రేవంత్ రెడ్డి మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో పర్యటించారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌లతో కలిసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీలో జరుగుతున్న తాజా వ్యవహారాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ అంశంకూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరిని పక్కన పెట్టాలి.. ఎవరిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలి అనే విషయాలపై వీరు చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో మంత్రివర్గ విస్తరణ ఖాయంగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే మంత్రివర్గంలో చోటుకోసం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ లు సూచించిన వారికి మంత్రివర్గంలో చోటు దక్కబోతుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో తరచూ వివాదాస్పదమవుతున్న ఓ మంత్రికి ఉద్వాసన పలికి.. వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి చోటు దక్కడం ఖాయంగా చెబుతున్నారు. ఈ కోటాలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతల్లో ఒకరికి మంత్రి పదవి వరించబోతుందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాధాన్యతలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కానీ, ఆ మేరకు అవకాశాలు లేవన్న చర్చ జరుగుతుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ ఉన్నారు. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఆ జిల్లాకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుతం మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన ఖాయమని సమాచారం. పక్కకు తప్పించిన వారి స్థానంలో అదే సామాజిక వర్గంకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు.. అందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుత మంత్రుల శాఖల్లో భారీ మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
