×
Ad

Telangana Cabinet Meeting : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

  • Published On : February 5, 2023 / 09:29 AM IST

KCR

Telangana cabinet meeting : నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనకు వెళ్లనున్నారు.

ఉదయం 11 గంటలకు బేగంపేట విమనాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ నాందేడ్ కు బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నాందేడ్ ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం చారిత్రక గురుద్వారాను సందర్శించనున్నారు.

Telangana Assembly sessions : ఈనెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు నాందేడ్ లో కేసీఆర్ సభ ఉంటుంది. కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. మహారాష్ట్ర నేతల చేరికల అనంతరం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు స్థానిక సిటీ ఫైడ్ హోటల్ కు వెళ్లనున్నారు. భోజనం అనంతరం జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ కు రానున్నారు.