Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. అలాచేస్తే 15శాతం శాలరీ కట్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
Telangana Govt : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు 15 శాతం జీతంలో కోత విధించాలని నిర్ణయించింది.
- Harishth Thanniru
- Published On : March 23, 2026 / 09:27 PM IST
CM Revanth Reddy
Telangana Govt : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గిగ్ వర్కర్ల బిల్లు, తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుతోపాటు తల్లిదండ్రులను ఆదరించని ఉద్యోగుల వేతనాల కట్ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
Also Read : Tamil nadu Elections : తమిళనాడులో ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి.. బీజేపీకి ఎన్ని సీట్లు దక్కాయంటే?
విద్వేష ప్రసంగాలు, హేట్ క్రైమ్‌ల నివారణకు “తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026”కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకనుంచి మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ప్రేరేపించే ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకోనుంది.
గిగ్ వర్కర్ల కోసం “తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026” బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో 4.2లక్షల గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయనుంది. గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, హక్కులకు కొత్త చట్టం రక్షణ కల్పించనుంది.
న్యాయవాదుల రక్షణ కోసం “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు”కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. వామనరావు హత్య ఘటన నేపథ్యంలో అడ్వకేట్ల భద్రతపై ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కుల గణనపై నిపుణుల కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదికపై సబ్ కమిటీ పరిశీలన చేయనుంది. అదేవిధంగా రోహిత్ వేముల చట్టం రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కమిటీ పని ప్రారంభించనుంది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం పై కీలక నిర్ణయం కేబినెట్ తీసుకుంది. రూ.15,000 కోట్లతో ఎల్ అండ్ టీ నుంచి మెట్రో ప్రాజెక్టు తీసుకునే ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించింది. HMRL ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ఇచ్చింది.
