Kcr Nalgonda
Telangana Chief Minister Tour : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై ఆరా తీశారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా…నల్గొండ పట్టణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రెండు ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్స్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Read More : Reliance Jio Alert : జియో యూజర్లకు అలర్ట్.. ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త..!
రూ. 36 కోట్లతో నూతన డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 31న 110కోట్ల రూపాయల వ్యయంతో ఐటీ హబ్‌కు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఆ పనుల వివరాలను కేసీఆర్ ఆరా తీశారు. పట్టణాన్ని సర్వంగాసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలతో పాటు నడుస్తున్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సమీక్షలో జిల్లా అధికారులను ఆదేశించారు కేసీఆర్. పానగల్ రిజర్వాయర్ ట్యాంక్‌బండ్, శిల్పకళాతోరణం ప్రణాళికల వివరాలు తెలుసుకున్నారు. రోడ్లు వెడల్పు చేయడంతో పాటు టౌన్‌హాల్ కొత్త భవనాన్ని నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్.
Read More : Ind Vs SA : టీమిండియా 174 ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 305 రన్స్
నల్గొండ జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్…తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. గాదరి కిశోర్ తండ్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. గాదరి కిశోర్ తండ్రి మారయ్య చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.