దారుణం.. అమానుషం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికిన భర్త.. మూటగట్టి మూసీలో..
Crime News : మేడ్చల్ జిల్లాలోని బాలాజీ హిల్స్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను హత్యచేసిన భర్త.. ఆమె మృతదేహాన్ని

Crime News
Crime News : మేడ్చల్ జిల్లాలోని బాలాజీ హిల్స్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను హత్యచేసి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త. ఆ తరువాత ఆ ముక్కలను ప్యాక్ చేసి బయట పడేసేందుకు సిద్ధమయ్యాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. (Crime News)
Also Read: Sahasra Case : సహస్ర హత్యకి మొదట అడుగు పడింది ఆ రోజే.. బయటపెట్టిన పోలీసులు
వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతిని అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. గత నెలలోనే బోడుప్పల్‌కు వచ్చి బాలాజీహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భార్య స్వాతిని మహేందర్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్వాతి గర్భవతిగా తెలుస్తోంది.
స్వాతిని హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలుగా కోసిన మహేందర్ రెడ్డి.. ఆ ముక్కలను కవర్లలో ప్యాక్ చేశాడు. ఆ కవర్లను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. మహేందర్ రెడ్డి బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హత్యకుగల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తలు మధ్య ఏమైనా ఘర్షణలు జరిగాయా అనే విషయాలపై చుట్టుపక్కల వారిని, కుటుంబ సభ్యులను పోలీసులు ఆరా తీస్తున్నారు.