×
Ad

Telangana Corona News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 640 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 987 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 542గా ఉంది.

  • Published On : October 23, 2022 / 08:55 PM IST

Telangana Corona News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 7వేల 269 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 69 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 43 కేసులు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో 5 కేసులు, నారాయణ్ పేట్ జిల్లాలో 3 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 70 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 640 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 987 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 542గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 8వేల 122 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 78 మందికి పాజిటివ్ గా తేలింది.

తెలంగాణ కరోనా బులెటిన్..