Telangana Corona News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 696 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 071 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 514గా ఉంది.
- Naveen
- Published On : October 11, 2022 / 08:31 PM IST
Telangana Corona News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 10వేల 403 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 85 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 47 కేసులు వచ్చాయి. మెదక్ జిల్లాలో 4 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 4 కేసులు, కరీంనగర్ జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 74 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 696 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 071 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 514గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 9వేల 329 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 87 మందికి పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.11.10.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealth pic.twitter.com/55OIuUm5xN— IPRDepartment (@IPRTelangana) October 11, 2022
