GO 77: సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ.. జీవో 77 రద్దు చేయాలని డిమాండ్.. ఏకపక్ష నిర్ణయాలపై నిరసన
సినిమా టికెట్ ధరల స్థిరీకరణ, థియేటర్ల నిర్వహణపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77(GO 77)పై తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
- V Santhosh Kumar
- Published on- August 25, 2026 / 04:35 PM IST
Telangana exhibitors association letter to cm revanth reddy demanding cancellation of go 77
- 77 జీవోపై ఎగ్జిబిటర్ల ఆవేదన
- సీఎం రేవంత్ రెడ్డికి లేఖ
- 400 సింగిల్ స్క్రీన్లకు ముప్పు
GO 77: సినిమా టికెట్ ధరల స్థిరీకరణ, థియేటర్ల నిర్వహణపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77(GO 77)పై తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోని 400కు పైగా థియేటర్ల యాజమాన్యాలను, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని లేదా జీవోను పూర్తిగా రద్దు చేసి తగిన సవరణలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రత్యేక లేఖ రాసింది.
TTD Board: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఇక కొండపై ఆ వంటకం దొరకదు
ఏకపక్ష నిబంధనలతో ఉపాధికి ముప్పు:
తెలంగాణలోని టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో 390కి పైగా ఎయిర్ కూల్డ్ థియేటర్లు ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా ఏసీ థియేటర్లుగా మార్చాలనడం అసాధ్యమని ఎగ్జిబిటర్లు తెలిపారు. ఒక్కో స్క్రీన్‌ను ఏసీగా మార్చేందుకు రూ. 60 నుండి 80 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇది భరించలేక ఇప్పటికే అనేక సింగిల్ స్క్రీన్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. థియేటర్ల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు, రిస్కులు అన్నీ ఎగ్జిబిటర్లే భరిస్తుంటే, ప్రొడ్యూసర్స్ గిల్డ్ విజ్ఞప్తి ఆధారంగా నిర్మాతలకు మాత్రమే అనుకూలంగా ఈ జీవో తీసుకురావడం ఏమాత్రం తగదని వారు స్పష్టం చేశారు.
ఎగ్జిబిటర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి:
మూడేళ్లలో థియేటర్ల ఆధునీకరణకు రూ. 300 కోట్లు ఖర్చు చేశామని, ఎగ్జిబిషన్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 20 వేల కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడిందని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. జీవో 77లో ప్రీమియం, నాన్ ప్రీమియం టికెట్ ధరలు, వర్గీకరణలో తీవ్ర గందరగోళం ఉందని, ఎంసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని కోరారు. సినీ పరిశ్రమకు వెన్నుముకలాంటి ఎగ్జిబిటర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
