Telangana Govt : 22ఏ భూములపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!

Telangana Govt : 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది.

Telangana Govt

Telangana Govt : హైదరాబాద్‌ పరిధిలో 22ఏ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నిబంధనలకు లోబడి 22ఏ పరిధిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది.

జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న భూములకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సంబంధిత సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందిన భూములను రిజిస్ట్రేషన్‌కు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో 22ఏ పరిధిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న భూయజమానులు, కొనుగోలుదారులకు వెసులుబాటు కలగనుంది. అయితే సంబంధిత భూమికి జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.

తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్‌ పరిధిలో 22ఏ భూముల రిజిస్ట్రేషన్లపై నెలకొన్న అనిశ్చితికి కొంతమేర పరిష్కారం లభించనుంది.