Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మహిళా సంఘాలకు శుభవార్త..

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది.

Telangana Govt

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • మహిళా సంఘాలకు మరో 40 పెట్రోల్ బంకులు
  • జూన్ 2న నాటికి 20 బంకులను ప్రారంభించేలా చర్యలు

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహిళకు స్వయం ఉపాధి, ఉద్యోగా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : Zaheerabad : ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో లేచిపోయిన భార్య.. ఆమె జాడ తెలుసుకొని భర్త చేసిన పనికి అంతా షాక్.. పోలీసులు, భార్య ప్రియుడి సమక్షంలోనే దారుణం..

ఇందిరా మహిళా శక్తి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఉపాధి మార్గాలను చూపిస్తోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులను కేటాయిస్తుంది. ఈ పెట్రోల్ బంకుల్లో సిబ్బంది, మేనేజర్లు, ఆపరేటర్లు చివరికి ఓనర్లు కూడా అందరూ మహిళలే కావడం గమనార్హం.

ఇప్పటికే ఈ పథకం కింద సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. అవి విజయవంతంగా కొనసాగుతుండడంతో రాష్ట్రంలోని మిగిలి జిల్లాల్లోనూ మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

రాష్ట్రంలోని 40చోట్ల మహిళా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పెట్రోల్ బంకులకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది. వీటిలో 20 పెట్రోల్ బంకులను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన నాటికి పూర్తిచేసి ప్రారంభించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ఫ్) యోచిస్తోంది.

పెట్రోల్ బంకుల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూములను సేకరించిన అధికారులు వాటిని మహిళా సంఘాలకు అప్పగించారు. ఇందులో పలు ప్రాంతాల్లో పనులుసైతం కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భూములను గుర్తించగా.. మహిళా సంఘాలకు ఇంకా అప్పగించాల్సి ఉంది. మొత్తానికి జూన్ 2వ తేదీ నాటికి కొన్నింటిని.. జులై నెల చివరి నాటికి అన్ని ప్రాంతాల్లో కొత్త బంకులను ప్రారంభించేలా అధికారులు దృష్టిసారించారు.