Zaheerabad : ఫేస్బుక్ ఫ్రెండ్‌తో లేచిపోయిన భార్య.. ఆమె జాడ తెలుసుకొని భర్త చేసిన పనికి అంతా షాక్.. పోలీసులు, భార్య ప్రియుడి సమక్షంలోనే దారుణం..
Zaheerabad : ఓ వివాహిత మహిళ ఫేక్బుక్లో పరిచయమైన వ్యక్తితో భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఆమెను తన వద్దకు తీసుకొచ్చుకొనే ప్రయత్నంలో భర్త హత్య చేశాడు.
Zaheerabad Crime News
- జహీరాబాద్‌లో దారుణం!
- ఫేస్బుక్ ప్రియుడితో వెళ్లిపోయిన భార్య
- పోలీసులు, ప్రియుడు ఉండగానే హత్యచేసిన భర్త
Zaheerabad : ఓ వివాహిత మహిళ ఫేక్బుక్లో పరిచయమైన వ్యక్తితో భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. వేరే ప్రాంతానికి వెళ్లి ప్రియుడితో కలిసి జీవిస్తుంది. ఆమె జాడ తెలుసుకున్న భర్త.. పోలీసులతో కలిసి భార్య వద్దకు వెళ్లాడు. తనతో రావాలని కోరాడు. స్థానిక పోలీసులుసైతం భర్తతో వెళ్లాలంటూ కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు. అందుకు మహిళ ససేమీరా అనడంతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో కారులో అంతా కలిసి జహీరాబాద్ వస్తున్న క్రమంలో భర్త భార్యపై చాకుతో దాడిచేసి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Hyderabad : ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ వేళ విషాదం.. బాలింత మృతి.. అనాథలైన ముగ్గురు చిన్నారులు
ఝరాసంగం మండలం తుమ్మన్పల్లికి చెందిన సిద్ధారెడ్డి (35), కవిత (29) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. జహీరాబాద్ పట్టణంలో అద్దెకు ఉంటున్నారు. సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతుండగా కవిత ఇంట్లోనే టైలరింగ్ పనిచేస్తుండేది. అయితే, కవితకు ఫేస్బుక్లో పవన్ కుమార్ రెడ్డితో కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఎటైనా వెళ్లిపోయి కలిసి జీవించాలని అనుకున్నారు.
మార్చి 27వ తేదీన కవిత తన ఫేస్బుక్ ప్రియుడు పవన్ రెడ్డితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించక పోవడవంతో రెండు రోజులు పరిసర ప్రాంతాల్లో, బంధువుల ఇండ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త సిద్ధారెడ్డి మార్చి 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కవిత జడ్చర్లలో తన ప్రియుడుతో ఉన్నట్లు తెలిసింది. దీంతో కవితను తనతో తీసుకొచ్చేందుకు పోలీసులతో కలిసి భర్త సిద్ధారెడ్డి జడ్చర్లకు వెళ్లారు. కవిత, ఆమె ప్రియుడు పవన్ కుమార్ రెడ్డికి జడ్చర్లలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి భర్త వెంట వెళ్లాలని సూచించారు.
భర్తతో వెళ్లేందుకు కవిత నిరాకరించింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ తరువాత టీ తాగేందుకు బయటకు వెళ్లిన సిద్ధారెడ్డి చాకును కొనుగోలు చేసి తన వద్ద పెట్టుకున్నాడు. ఆమె తన భర్తతో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో కారులో ప్రియుడు పవన్‌రెడ్డితో కలిసి జహీరాబాద్‌కు బయలుదేరారు. భార్యాభర్తలు గొడవ పడొద్దని.. వారిద్దరి మధ్యలో కూర్చుంటానని కానిస్టేబుల్ ఖదీర్ చెప్పినా కవిత ఒప్పుకోలేదు.
సిద్ధారెడ్డి, పవన్రెడ్డిలతో కలిసి వెనక సీటులో కూర్చుంది. కాసేపట్లో జహీరాబాద్ చేరుకుంటామనేలోగా సిద్ధారెడ్డి జేబులోంచి చాకు తీసి కవిత గొంతు, మెడపై పొడిచాడు. అప్రమత్తమైన పోలీస్ కానిస్టేబుల్ ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కవిత మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
