Alcohol Prices Increase : మందు బాబులకు షాకింగ్ న్యూస్.. ఫుల్ బాటిల్‌పై 80.. హై-ఎండ్ కాస్ట్‌లీ బ్రాండ్లపై ఏకంగా రూ.120 పెంపు..? అమల్లోకి ఎప్పటినుండంటే?

Alcohol Prices Increase : లిక్కర్ తయారీ కంపెనీల ఒత్తిడి మేరకు మద్యం ధరలను భారీగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ఈనెలలోనే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Alcohol Prices Increase

  • మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్
  • భారీగా పెరగనున్న మద్యం ధరలు
  • వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం

Alcohol Prices Increase : మందు బాబులకు బిగ్ షాకిచ్చేందుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. లిక్కర్ తయారీ కంపెనీల ఒత్తిడి మేరకు మద్యం ధరలను భారీగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ధరల పెంపునకు సంబంధించిన ఫైల్ రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్లు.. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత.. ఈ నెల 15వ తేదీ నుంచి పెంచిన మద్యం రేట్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Also Read : Rain Alert : తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు వర్షాలు.. భీకర గాలులు.. రెడ్ అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో మద్యం ధరలను కూడా పెంచాలని లిక్కర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరుతున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరలను ఎంతమేర పెంచాలన్న దానిపై ప్రభుత్వం ఏప్రిల్ నెలలో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ మూడు రోజులుగా మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ చర్చలు శుక్రవారంతో ముగిశాయి.

మద్యం ధరలను 10శాతం నుంచి 15శాతం మధ్యలో పెంచాలని కంపెనీలు త్రిసభ్య కమిటీ సభ్యులకు విన్నవించాయి. మద్యం కంపెనీలు పేర్కొన్న ప్రకారం.. ఒక్కో ఫుల్ బాటిల్ పై గరిష్ఠంగా రూ.80 వరకు పెరిగే అవకాశం ఉందని, ప్రీమియం బ్రాండ్లు అయితే రూ.90దాకా పెరిగే అవకాశం ఉందని, కాస్ట్లీ బ్రాండ్లు (హై-ఎండ్) అయితే రూ.120పైనే పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తన నిర్ణయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమై చర్చించిన తరువాత ధరల పెంపు ఫైల్ ను రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈనెల 15 నుంచి పెంచే ధరలు అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలు పెంచిన నేపథ్యంలో ఈసారి బీర్ల ధర పెంపు ఉండదని తెలిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్ షాపులు ఉన్నాయి. మద్యం ధరల పెంపువల్ల ప్రతీనెల ప్రభుత్వానికి రూ.200 కోట్ల నుంచి రూ. 250కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతుందని అంచనా. అంటే ఏడాదికి రూ.2,400 కోట్లు నుంచి రూ.3వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.