Summer Holidays : తెలంగాణలో విద్యార్థులకు అలర్ట్.. వేసవి సెలవులు పొడిగింపు… స్కూళ్లు పున:ప్రారంభం తేదీ ఇదే..

Summer Holidays : తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ మారింది. ఈనెల 15వ తేదీన స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి.

Telangana Government issued orders extending schools holidays until June 15

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • పాఠశాలల వేసవి సెలవులు పెంపు
  • జూన్ 15న పున: ప్రారంభం కానున్న స్కూళ్లు

Summer Holidays : తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ మారింది. ఈనెల 15వ తేదీన స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదల చేసింది.

Also Read : Bhindi Price In US : వామ్మో.. కిలో బెండకాయ ధర ఎంతో తెలుసా? వీడియో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..

వాస్తవానికి జూన్ 12వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఈనెల 13వ తేదీన రెండో శనివారం, జూన్ 14వ తేదీన ఆదివారం కావడంతో పాఠశాలల పున: ప్రారంభం తేదీని ప్రభుత్వం జూన్ 15కు పెంపుచేసింది. ఈ విద్యా సమయాన్ని భర్తీ చేసేందుకు జులై 11 రెండో శనివారంను సాధారణ పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే అంగన్‌వాడీల పున: ప్రారంభ తేదీని ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. జూన్ 2వ తేదీన అంగన్వాడీలను పున:ప్రారంభించాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సెలవులను పొడిగించింది. దీంతో జూన్ 15వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలు తిరిగి యథావిధిగా పనిచేయడం ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు.