Telangana Students : స్కూల్ విద్యార్థులకు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి అందించే వస్తువులివే..

Telangana Students : కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకూ గురుకుల విద్యార్థులతో సమానంగా వసతులు కల్పించనున్నారు.

Telangana Students

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • స్కూల్ విద్యార్థులకు షూస్, బెల్ట్
  • కొత్తగా బ్యాగులు, స్టేషనరీ కిట్, మూడు రకాల డ్రెస్సులు
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం

Telangana Students : తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించే సౌకర్యాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ రోజే అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.

Also Read : Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించాలి..

రాష్ట్రంలో ప్రభుత్వ, లోకల్ బాడీ స్కూళ్లలో సుమారు 18.70లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, ఇన్నాళ్లు కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు సౌకర్యాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. ఇకపై వీరికి కూడా ఇతర రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా అన్ని వస్తువులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు ఏకంగా 18 రకాల వస్తువులను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందించే సౌకర్యాల్లో భాగంగా.. షూష్‌తోపాటు బెల్టులు, రెండు జతల సాక్స్ లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకూ గురుకుల విద్యార్థులతో సమానంగా వసతులు కల్పించనున్నారు. ఏటా ఇచ్చే యూనిఫామ్, నోట్ బుక్స్, టెక్ట్స్ వర్క్ బుక్స్ తోపాటు కొత్తగా స్కూల్ బ్యాగులు, ట్రంక్ బాక్స్, స్టేషనరీ కిట్లు ఇవ్వనున్నారు. హాస్టల్ విద్యార్థులకు కొత్తగా స్పోర్ట్స్ యూనిఫాం, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్‌లనూ అదనంగా ఇవ్వనున్నారు.

విద్యార్థులకు అందించే వస్తువులు ఇవే..
స్కూల్ బ్యాగులు, బెల్ట్, టై ఐడీ కార్డు (హోల్డర్‌తో సహా), బెడ్ షీట్లు, టవల్స్, కార్పెట్లు, ట్రంక్ బాక్సులు, ప్లేట్, గ్లాస్, కప్పు మరియు స్పూన్, ట్రాక్ సూట్లు, నైట్ డ్రెస్సులు, పీటీ డ్రెస్సులు, బ్లాక్ షూష్‌తోపాటు రెండు జతల సాక్స్‌లు, వైట్ షూష్‌తోపాటు రెండు జతల సాక్స్‌లు, దుప్పట్లు, స్టేషనరీ కిట్, నోట్ బుక్స్ తదితర వాటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.