Telangana Govt : ఆహా.. విద్యార్థులకు శుభవార్త.. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం మెనూ ఇదే.. మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా.. ఇంకా.. రోజుకోరకం

Telangana Govt : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్'‌ మెనూను అధికారులు రిలీజ్ చేశారు. ఆరు రోజులు.. ఐదు రకాల టిఫిన్లు అందించనున్నారు.

Telangana govt CM Breakfast Scheme Menu Released

  • ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ మెనూ రిలీజ్
  • ఆరు రోజులు.. ఐదు రకాల టిఫిన్లు
  • మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మాతోపాటు రాగిజావ

Telangana govt CM Breakfast Scheme Menu Released : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు.. ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ (CM Breakfast Scheme) ను అమలు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో ఉదయాన్నే విద్యార్థులకు రోజుకో రకమైన అల్పాహారాన్ని అందజేయనున్నారు. ఇందుకోసం అధికారులు మెనూసైతం రూపొందించారు. ఆరు రోజుల్లో ఐదు రకాల టిఫిన్లు విద్యార్థులకు అందించనున్నారు.

Also Read : Teamindia : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో టీమిండియా రెండు మ్యాచ్‌లు.. తేదీలు ఇవే.. విశాఖలో మాత్రం..

రాష్ట్ర వ్యాప్తంగా 26,178 వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 19లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం రూపంలో పౌష్టికాహారం అందించాలని రేవంత్ సర్కార్ భావించింది. ఈ క్రమంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పేరుతో పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 12 నుంచి దీనిని అమలు చేయనుండగా.. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకంకు సంబంధించి మెనూను రిలీజ్ చేశారు.

విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి.. విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని ప్రభత్వం భావిస్తోంది. జూన్ 2న స్కూల్ రీ ఓపెనింగ్ రోజు నుంచే విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, జూన్ 12 నుంచి పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

మెనూ ఇలా..
♦ సోమవారం : దోశ, పాలు
♦ మంగళవారం : మిల్లెట్ ఇడ్లీ, రాగి జావ
♦ బుధవారం : పూరీ, పాలు
♦ గురువారం : మిల్లెట్ ఇడ్లీ, రాగి జావ
♦ శుక్రవారం : మిల్లెట్ ఉప్మా లేదంటే పొంగల్, పాలు
♦ శనివారం : బోండా, రాగి జావ