Telangana RTC Employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
Telangana RTC employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 2.1శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు చేసింది.
- Harish Thanniru
- Updated on- April 10, 2026 / 02:08 PM IST
telangana rtc da hike
- ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
- ఉద్యోగులకు డీఏ పెంపు
- ఈ ఏడాది జనవరి నుంచి పెరిగిన డీఏ అమల్లోకి
Telangana RTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 2.1శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తాజా పెంపుతో ప్రస్తుతం ఉన్న 50.7శాతం డీఏ 52.8శాతంకు పెరిగింది. 1 జనవరి 2026 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి రానుంది.
Also Read : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
గత మూడు నెలల పెండింగ్ డీఏను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లింపులు చేయనున్నారు. డీఏ పెంపుతో ఆర్టీసీపై నెలకు రూ.2.82 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. జులై 2025లో కూడా 2.1శాతం డీఏను ప్రభుత్వం పెంచింది. మే 2024లో RPS-2017 అమలు చేసినప్పటి నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలేవీ పెండింగ్‌లో లేవని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
ఆర్టీసీ పెండింగ్ పనులపై రీజియనల్ మేనేజర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం వెల్లడించారు. ఆసుపత్రుల అప్టేడేషన్, కారుణ్య నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలుతో సంస్థను ఆధునీకరించడం. ఇలా అనేక కార్యక్రమాలతో ఆర్టీసీని గాడిలో పెడుతున్నామని ఆయన వివరించారు. తెలంగాణకు లైఫ్‌లైన్‌గా ఉన్న ఆర్టీసీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.
