TG Govt Jobs: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 2500 పోస్టులు..
Telangana Govt Jobs: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదరుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
- Harishth Thanniru
- Updated on- April 23, 2026 / 10:33 AM IST
Telangana Govt
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- నిరుద్యోగులకు శుభవార్త
- ఇక నుంచి నెలకో నోటిఫికేషన్
- కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ
Telangana Govt Jobs : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదరుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వారికోసం ఇకపై నెలకో నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పక్కా ప్రణాళిక చేస్తోంది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్ కు ఇబ్బంది పడకుండా ఉండేలా టీజీపీఎస్సీ కసరత్తు చేపట్టింది.
Also Read : గెలిచే మ్యాచ్ ఓడాం.. వాళ్లవల్లే ఇదంతా.. నా తప్పు కూడా ఉంది.. రిషబ్ పంత్ కీలక కామెంట్స్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీజీపీఎస్సీ ద్వారా ఇప్పటికే వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న ఫలితాలను రిలీజ్ చేసి సుమారు 26వేల పోస్టులను భర్తీ చేశారు. గ్రూప్స్ పోస్టులను పెంచి నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చింది. మొత్తంగా అన్ని బోర్డుల కింద 70వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం నెలవారీ నోటిఫికేషన్ల విధానంతో మిగిలిన ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు 2,500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ రూపొందించే పనిలో టీజీపీఎస్సీ అధికారులు నిమగ్నమయ్యారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ నెల 27 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. అయితే, త్వరలోనే అదే పీసీబీ విభాగంలో మరో ఆరు, ఏడు రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ చర్యలు ప్రారంభించింది. వీటితోపాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. విద్యాశాఖలోనూ డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ల పోస్టులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ప్రతీనెలా ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు.. పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతుంది. ఇతర రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలు, యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ లాంటి జాతీయ స్థాయి పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని పరీక్షల షెడ్యూల్ ను రూపొందిస్తుంది. దీంతో నిరుద్యోగులు ఒకే సమయంలో రెండు పరీక్షల మధ్య ఇబ్బంది పడకుండా అన్నింటికీ హాజరయ్యే అవకాశం లభించనుంది.
