Telangana Government : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మరో కొత్త పథకంకు శ్రీకారం.. వారందరికీ రూ.5లక్షలు.. వెంటనే ఇలా చేయండి

Telangana Government : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పథకాలను అమలు చేస్తోంది.

Telangana Government

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పథకాలను అమలు చేస్తోంది. అయితే, రాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా కొత్త పథకానికి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది.

Also Read : Mona Lisa Pink Diamond : గోల్కొండ టు జెనీవా వేలం వరకు.. రూ.130 కోట్లకు అమ్ముడైన 24 క్యారెట్ల బల్గారి పింక్ డైమండ్..

తెలంగాణలోని ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబరు 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు. పథకం అమలు, విధివిధానాలపై కీలక సూచనలు చేశారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశంలోనే వినూత్నమైనదని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని భట్టి విక్రమార్క తెలిపారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 14వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నుంచి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో నిర్వహించిన తాజా కులగణన సర్వే ద్వారా కుటుంబాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు.

ఈనెల 19వ తేదీన ప్రతి గ్రామం, మున్సిపల్ పరిధిలో వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి కుటుంబాల వివరాలు సేకరించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం, పట్టణంలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఇందులో భాగంగా నవంబరు 17, 18 తేదీల్లో గ్రామాల్లో దండోరా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. టీవీ, పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా కూడా పథకం వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.