Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీకి చర్యలు ప్రారంభించింది.
- Harishth Thanniru
- Published on- April 18, 2026 / 11:53 AM IST
CM Revanth Reddy
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- త్వరలో పట్టణ ప్రాంతాల్లోని మహిళాకు ఇందిరమ్మ చీరలు
- పంపిణీకి సన్నాహాలు చేస్తున్న అధికారులు
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇందిరమ్మ చీరలు పంపిణీకి రెడీ అయ్యాయి. త్వరలో వీటిని మహిళా సంఘాల్లోని సభ్యులకు అందజేయనున్నారు.
Also Read : Gold Rate Today : అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
గతేడాది నవంబర్ 19వ తేదీన ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మొదటి విడత కింద గ్రామీణ ప్రాంత మహిళలకు ఒక్కో చీరను ప్రభుత్వం అందజేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రెండో విడత అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది.
రేవంత్ రెడ్డి సర్కార్ గతేడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతన్నలకు ఇందిరమ్మ చీరలకు సంబంధించి క్లాత్ ఉత్పత్తి ఆర్డర్‌ను అప్పగించింది. మొత్తం 7కోట్ల మీటర్ల క్లాత్ కోసం ఆర్డర్ ఇవ్వగా.. మొదటి విడత కింద 4కోట్ల మీటర్ల క్లాత్‌ను ఉత్పత్తి చేయించింది. దాదాపు 60లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసింది. దీంతో గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ చీరలను పంపిణీ పూర్తి చేశారు. అయితే, రెండో విడతలో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నేతన్నల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలకు అవసరమైన క్లాత్ ఉత్పత్తి పూర్తి కాగా.. ఇందులో 35లక్షల చీరల క్లాత్ ను ఇప్పటికే టెస్కో సేకరించింది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టెస్కో ఆఫీసర్లు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు.. ఇందిరమ్మ చీరల క్లాత్ ను ఉత్పత్తి చేసిన నేతన్నల ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1.75కోట్లు డిపాజిట్ చేసింది.
