Gold Rate Today : అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. శుక్రవారం భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఇవాళన మళ్లీ భారీగా పెరిగింది. వెండి ధరసైతం ఇవాళ భారీగా పెరిగింది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 810 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 750 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 45 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,833 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర సైతం ఇవాళ భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,780 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,930కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,950 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,780కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,42,800 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
