Mee Seva Door Step: ఇక ‘ఇంటి వద్దకే మీ సేవ’ సర్వీసులు.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో..

తెలంగాణలో పౌర సేవలను సులభంగా అందించేందుకు 'ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు(Mee Seva Door Step)' విధానాన్ని మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.

Telangana government officially launched Meeseva door delivery services.

Mee Seva Door Step: తెలంగాణ ప్రజలకు మరింత సులభంగా పౌర సేవలను అందించేందుకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ‘ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు(Mee Seva Door Step)’ పేరిట సరికొత్త డోర్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన దీనికి సంబంధించిన అధికారిక పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం వద్దకే తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. పౌరులు ఇకపై మీ సేవ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, సులభంగా తమ దరఖాస్తులను పూర్తి చేసుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

Mamata Banerjee: బెంగాల్‌లో రీపోలింగ్‌ పెట్టాలి.. సీఈసీని అరెస్ట్ చేయాలి.. SIR వివాదంపై మమతా సంచనల కామెంట్స్

సేవలు పొందే విధానం.. అందుబాటులో ఉండే సర్టిఫికెట్లు:

ఈ కొత్త విధానంలో భాగంగా 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి గానీ, లేదా అధికారిక మీ సేవ పోర్టల్ ద్వారా గానీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ ఆధారంగా మీ సేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా దరఖాస్తుదారు ఇంటికే వచ్చి వివరాలు సేకరిస్తారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లతో పాటు ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు వంటి కీలక పౌర సేవలన్నింటినీ ఇంటి వద్ద నుంచే పొందే వెసులుబాటు ఉంటుంది.

ప్రత్యేక శిక్షణ, పైలట్ ప్రాజెక్ట్ వివరాలు:

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన సేవలు అందించేందుకు ఇప్పటికే 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, వీఎల్ఈ (VLE)లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొదటి దశలో భాగంగా ఈ డోర్ డెలివరీ విధానాన్ని ‘క్యూర్’ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని తెలిపారు. ఇక్కడ పొందిన అనుభవం, ఫలితాల ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.