TG Outsourcing Salaries: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక నెల తొలి తేదీనే జీతం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

TG Outsourcing Salaries: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ (Outsourcing) ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

telangana government orders salaries on first day for outsourcing employees

  • ప్రతి నెల మొదటిరోజే జీతం
  • ఆలస్యమైతే అధికారులపై చర్యలు
  • ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఊరట

TG Outsourcing Salaries: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ (Outsourcing) ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీతాల చెల్లింపుల్లో తరచూ ఎదురవుతున్న ఆలస్యాలను నివారించేందుకు ఆర్థిక శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి నెల 21వ తేదీ నుంచి తదుపరి నెల 20వ తేదీ వరకు హాజరు వివరాలను పరిగణనలోకి తీసుకుని వేతన బిల్లులు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.

*ACB Raids: ఆర్అండ్బీలో అవినీతి అనకొండ.. ఈఎన్సీ అక్రమాస్తులు రూ.200 కోట్లు.. కిలోల కొద్దీ బంగారం, నగదు స్వాధీనం

ఈ మేరకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ప్రతి నెల 25వ తేదీ లోపు వేతన బిల్లులను ట్రెజరీలకు పంపించాలని, నెలాఖరు కల్లా వాటి పరిశీలన, ఆడిట్ ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించింది. పరిపాలనా నిర్లక్ష్యం కారణంగా జీతాల చెల్లింపులు ఆలస్యమైతే సంబంధిత శాఖాధిపతులు, డీడీఓలపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

అదే సమయంలో విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల్లో ఈ-కుబేర్ విధానం ద్వారా జీతాల చెల్లింపులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. గెజిటెడ్ అధికారులు లేని చోట ప్రభుత్వ గెజిటెడ్ అధికారులకు లేదా ప్రత్యేక అనుమతితో సంస్థల సీనియర్ అధికారులకు డీడీఓ అధికారాలు అప్పగించే అవకాశం కల్పించింది. ఈ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు అప్పగించారు.