Telangana Free Bus: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఇక వారికి కూడా ఉచిత ప్రయాణం.. క్షేత్రస్థాయిలో సన్నాహాలు!
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం(Telangana Free Bus) ద్వారా మరో కీలక నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
- V Santhosh Kumar
- Updated on- October 2, 2026 / 07:14 PM IST
Telangana government proposes free bus travel senior citizens
Telangana Free Bus: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం సక్సెస్‌ఫుల్‌గా అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో వయోవృద్ధులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దిశగా రవాణా శాఖ తీవ్రంగా యోచిస్తోంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో ప్రతిరోజూ(Telangana Free Bus) ప్రయాణించే వేలాది మంది సీనియర్ సిటిజన్లకు రవాణా ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ముందడుగు వేస్తోంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి.. పరిశీలనలో ప్రత్యేక ఉచిత పాస్‌లు:
ఈ ప్రతిపాదనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు పాస్‌లు జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది ప్రాథమిక ఆలోచన, ప్రతిపాదనల దశలోనే ఉందని, అర్హులైన వయోవృద్ధులందరికీ ఉచిత పాస్‌ల ద్వారా ప్రయాణ సౌకర్యం కల్పించడానికి కావలసిన నిబంధనలు, అర్హతలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు.
నిబంధనల రూపకల్పన పూర్తి కాగానే ప్రకటన.. వయస్సు పరిమితిపై ఉత్కంఠ:
మహాలక్ష్మి స్కీమ్‌లో ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుండగా, సీనియర్ సిటిజన్లకు మాత్రం ప్రత్యేక పాస్‌లు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. ఏ వయస్సు వారికి ఈ పథకం వర్తింపజేయాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. విధివిధానాలు, సాంకేతిక అంశాలు, బడ్జెట్ అంచనాలు పూర్తిగా ఖరారైన తర్వాతే ఈ పథకం అమలు తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.
