Textbooks Prices : విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట.. పుస్తకాల ధరలు భారీగా తగ్గాయ్.. ప్రస్తుత రేట్లు ఇవే..
Textbooks Prices : తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ఊరట కల్పించింది. వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి పదో తరగతి వరకు పుస్తకాల ధరలను తగ్గించింది.
- Harish Thanniru
- Updated on- May 27, 2026 / 08:46 AM IST
Textbooks Price reduced
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ ఊరట
- 1 నుంచి పదో తరగతి వరకు పుస్తకాల ధరలు తగ్గాయ్
Textbooks Prices : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా విద్యార్థుల త్లలిదండ్రులకు భారీ శుభవార్త చెప్పింది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు, పుస్తకాల భారంతో సతమతమవుతున్న పేరెంట్స్‌కు సర్కార్ ఊరటనిచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ పాఠ్య పుస్తకాల ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో పుస్తకంపై సుమారు 15 నుంచి 20శాతం మేర ధరలను తగ్గించింది.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లోని సిబ్బందికి అదిరిపోయే శుభవార్త..
రాష్ట్రంలో 11వేల వరకూ ప్రైవేట్ స్కూళ్లు ఉండగా.. వాటిలో 38లక్షల మంది చదువుతున్నారు. అయితే, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించిన సిలబస్ పుస్తకాలు, ప్రభుత్వం ప్రింట్ చేసిన పుస్తకాలనే విద్యార్థులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో తాజాగా.. ప్రభుత్వం పుస్తకాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కలిగించే అంశం. పుస్తకాల ధరలు తగ్గించిన క్వాలిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో గతంకంటే మెరుగైన క్వాలిటీతో లామినేటెడ్ పుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తోంది.
2026-27 విద్యా సంవత్సరానికిగాను పాఠ్యపుస్తకాల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గింది. తరగతుల వారీగా గతేడాదితో తగ్గిన పుస్తకాల ధరలను పరిశీలిస్తే..
♦ 10వ తరగతి సెట్ ధర గతేడాది రూ.1,078 కాగా.. ప్రస్తుతం రూ.900కు తగ్గింది.
♦ 9వ తరగతి సెట్ ధర గతేడాది రూ.927 కాగా.. .ప్రస్తుతం రూ.776కు తగ్గింది.
♦ 8వ తరగతి సెట్ ధర గతేడాది రూ.825 కాగా.. .ప్రస్తుతం రూ.690కు తగ్గింది.
♦ 7వ తరగతి సెట్ ధర గతేడాది రూ.654 కాగా.. .ప్రస్తుతం రూ.548కు తగ్గింది.
♦ 6వ తరగతి సెట్ ధర గతేడాది రూ.572 కాగా.. .ప్రస్తుతం రూ.481కు తగ్గింది.
♦ 5వ తరగతి సెట్ ధర గతేడాది రూ.372 కాగా.. .ప్రస్తుతం రూ.312కు తగ్గింది.
♦ 4వ తరగతి సెట్ ధర గతేడాది రూ.332 కాగా.. .ప్రస్తుతం రూ.278కు తగ్గింది.
♦ 3వ తరగతి సెట్ ధర గతేడాది రూ.324 కాగా.. .ప్రస్తుతం రూ.273కు తగ్గింది.
♦ 2వ తరగతి సెట్ ధర గతేడాది రూ.222 కాగా.. .ప్రస్తుతం రూ.188కు తగ్గింది.
♦ 1వ తరగతి సెట్ ధర గతేడాది రూ.247 కాగా.. .ప్రస్తుతం రూ.209కు తగ్గింది.
