Retired Employees Dues: ఆ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. రూ. 2000 కోట్లు విడుదల
Retired Employees : తెలంగాణ సర్కార్ పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Updated on- May 30, 2026 / 04:51 PM IST
Telangana government relaease rs 2000 cr arrears of retired employees released
- రేవంత్ సర్కార్ శుభవార్త
- రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల
- తొలి విడతలో భాగంగా రూ.2 వేల కోట్లు విడుదల
Retired Employees Dues : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించి రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. ఇంతకీ ఈ మొత్తం దేనికి సంబంధించి అంటే.. పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుల్లో భాగంగా సర్కార్ రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వచ్చే 100 రోజుల్లోగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల జేఏసీకి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా.. ముందుగా రూ.2 వేల కోట్లు విడుదల చేసింది.
రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులో భాగంగా తొలివిడతగా.. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థికశాఖ मंत्री భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కొన్ని కీలకమైన బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన రూ.4,000 కోట్లను కూడా నిర్ణీత గడువులోగా విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది.
*21కేసులు.. 14ఏండ్లుగా పరారీ.. మోస్ట్ వాంటెండ్ రౌడీ షీటర్‌ను పట్టించిన గ్యాస్ కనెక్షన్..
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో అమలుచేసి చూపిస్తామని తెలిపారు. ఉద్యోగుల దీర్ఘకాలిక బకాయిలన్నీ చెల్లించడానికి పక్కా కార్యాచరణతోనే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలలో భాగంగా.. తొలి విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. వంద రోజుల్లో బకాయిలను చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు ముందడుగు పడిందని ఇందుకు గాను ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
