Hyderabad : 21కేసులు.. 14ఏండ్లుగా పరారీ.. మోస్ట్ వాంటెండ్ రౌడీ షీటర్‌ను పట్టించిన గ్యాస్ కనెక్షన్..
Hyderabad : యూపీకి చెందిన విష్ణవ్ కిషన్ దాస్ పై 1999 నుంచి సల్తాన్ బజార్ పీఎస్ లో రౌడీ షీట్ నమోదైంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు ఇతర జిల్లాల్లో అతడిపై 21 కేసులు ఉన్నాయి.
Hyderabad Police arrest most wanted criminal based on gas connection
Hyderabad : 21 కేసులు.. 14ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాటెండ్ రౌడీషీటర్.. మలక్‌పేటలో పురోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, తాజాగా అతన్ని గ్యాస్ కనెక్షన్ పట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Siddaramaiah : కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య భేటీ.. డిమాండ్స్ ఇవే.. కొడుకు కోసమే పట్టు..! ఈ శాఖలపైనే గురి
యూపీకి చెందిన విష్ణవ్ కిషన్ దాస్ పై 1999 నుంచి సల్తాన్ బజార్ పీఎస్ లో రౌడీ షీట్ నమోదైంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు ఇతర జిల్లాల్లో అతడిపై 21 కేసులు ఉన్నాయి. 2010లో ఓ హత్య కేసులో అరెస్టైన అతను.. రెండేళ్లు జైలు జీవితం తరువాత బయటకు వచ్చాడు. 2012 మే నెలలో బెయిల్ పై విడుదలైన అతను అప్పటి నుంచి కోర్టు విచారణలకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు.
2012 తరువాత విష్ణవ్ తన గుర్తింపును పూర్తిగా మార్చుకున్నాడు. ఆధార్ కార్డులో తన పేరును విష్ణవ్ కిషన్ దాస్ బదులు వైష్ణవ్ గణేశ్ మహారాజ్‌గా మార్పు చేసుకున్నాడు. మలక్ పేటలో నివాసం ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా పురోహిత్యం చేస్తున్నాడు. అయితే, నిందితుడి ఆచూకీకోసం పోలీసు బృందాలు నిరంతరం నిఘా పెట్టాయి.
తాజాగా.. అతను వాడుతున్న పాత మొబైల్ నంబర్ ఆధారంగా కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ మొబైల్ నెంబర్ తో ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు జాగ్రత్తపడి నవంబర్ ను మార్చాడు. గ్యాస్ కనెక్షన్ రికార్డుల్లో అప్డేట్ చేసిన కొత్త నంబర్.. వైష్ణవ్ గణేశ్ మహరాజ్ అనే పేరు ఉండటాన్ని పోలీసులు గమనించి, విచారణ చేపట్టారు. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా ఇంటి అడ్రస్ చేధించిన పోలీసులు మలక్‌పేటలో అతని నివాసంలో విష్ణవ్ (వైష్ణవ్ గణేశ్ మహారాజ్)ను ఈనెల 27నఅరెస్టు చేశారు.
